telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు

dhulia

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ తిగ్మాంషు ధులియా తెరకెక్కించిన వెబ్ సిరీస్ ‘ఔట్ ఆఫ్ లవ్’. అక్రమ సంబంధాల నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ ఇది. ఔట్ ఆఫ్ లవ్’ వెబ్ సిరీస్ హాట్‌స్టార్ ప్లాట్‌ఫాంలో విడుదల కానుంది. నవంబర్ 22న విడుదల కాబోతోంది. దీని గురించి ధులియా మీడియాతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అక్రమ సంబంధాలు ఈరోజుల్లో కామనే. ఇది మానవ సహజం. కానీ కొందరు వ్యక్తులు కట్టుకున్న వారిని మోసం చేయలేక పరాయి వారితో సంబంధాలు పెట్టుకోరు. మరికొందరు ఈ విషయంలో చాలా వీక్‌గా ఉంటారు. అందుకే కట్టుకున్న భార్యను, భర్తను మోసం చేసి పరాయి వ్యక్తులతో సెక్స్ చేస్తుంటారు. నేను ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్ సిరీస్‌ను ఇదే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాను. నేను ఇప్పటివరకు చదివిన స్క్రిప్ట్స్‌లో ఇది చాలా బెస్ట్ అని నా అభిప్రాయం. నేను స్క్రిప్ట్ అంతా చదివాను కాబట్టి ఈ వెబ్ సిరీస్‌ను నేనొక్కడినే డైరెక్ట్ చేశాను. ప్రేమ, అబద్ధాలు, అక్రమ సంబంధాల నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ ఉంటుంది. ఇందులో రసికా దుగ్గల్, పురబ్ కోహ్లీ, సోనీ రాజ్దాన్, హర్ష్ ఛాయా కీలక పాత్రల్లో నటించారు. వీరంతా చాలా సహజంగా నటించారు. భవిష్యత్తు అంతా వెబ్ సిరీస్‌పైనే ఆధారపడి ఉంది. ఆసక్తికరమైన కంటెంట్‌తో ఇండియా ఎన్నో వెబ్ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది” అని వెల్లడించారు.

Related posts