పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని 25 సీట్లకు కూడా ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకశ్మీర్ బిల్లుపై లోక్ సభలో వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు చక్కబడితే జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా ఇస్తామని లోక్ సభ సాక్షిగా వెల్లడించారు.ప్రధాని ఎంతో తెగువ కనబర్చారని అన్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత జమ్మూకశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వస్తుందని చెప్పారు. పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసని అన్నారు.
1948లో భారత సేనలు పాక్ ఆర్మీని తరుముకుంటూ బాలాకోట్ వరకు వెళ్లాయని, ఇంతలోనే నెహ్రూ భారత బలగాలను వెనక్కి పిలిపించారని, ఈ కారణంగానే పీఓకే మనకు దూరమైందని అమిత్ షా సభలో వివరించారు. పీఓకే ముమ్మాటికీ జమ్మూకశ్మీర్ లో అంతర్భాగమేనని అమిత్ షా స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏడు దశాబ్దాల సమస్యకు తెరపడిందని అన్నారు. ఈ ఆర్టికల్ కారణంగానే కశ్మీర్ ను భారత్ నుంచి వేరుగా చూశారని తెలిపారు. ఇప్పుడా పరిస్థితి లేదని అమిత్ షా స్పష్టం చేశారు.
సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి