ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కడప అమీన్ పీర్ దర్గాలో జరగనున్న వార్షిక ఉర్సు మహోత్సవాలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం అందింది.
దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ ఆరిఫుల్లా హుస్సేనీ నేడు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి ఉత్సవాలకు రావాల్సిందిగా కోరారు.
ఈ సందర్భంగా ఉర్సు వేడుకల ఆహ్వాన పత్రికను సీఎం చంద్రబాబుకు అందజేశారు. వచ్చే నెల (నవంబర్) 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు వారు ముఖ్యమంత్రికి వివరించారు.
ఏటా జరిగే ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని తెలిపారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పీఠాధిపతి వెంట దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీ ఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు.