నవ్యాంధ్ర రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే వందలాది ఎకరాలు తెలుగుదేశం నేతలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, తన బంధువుతో కలిసి అమరావతి ప్రాంతంలో 500 ఎకరాలను కొనుగోలు చేశారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ప్రత్యేక కథనాన్ని ఈరోజు ప్రచురించింది. ఏపీకి రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని ప్రకటించకముందే ఈ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టు పత్రిక కథనంలో పేర్కొంది. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మంత్రులు నారాయణ, నటుడు మురళీ మోహన్ హెరిటేజ్ సంస్థ వందల ఎకరాలను కొనుగోలు చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
గుంటూరు – విజయవాడల మధ్య రాజధాని ఉంటుందని ప్రకటించక ముందే బాలకృష్ణ, తన బంధువుతో కలిసి 500 ఎకరాలను కొనుగోలు చేశారు. తెలుగుదేశం నేతలు ఎంతో మంది ఈ ప్రాంతంలో భూములను ముందే కొన్నారు. ఆ వివరాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయి” అని వైసీపీ నేతలు అంటున్నారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నిన్నమీడియాతో మాట్లాడుతూ, అమరావతిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటకు తెస్తామనిఅన్నారు. అమరావతిలో భూ సమీకరణ ఓ అతిపెద్ద స్కామ్ అని బొత్స వ్యాఖ్యానించారు.
బడ్జెట్ లో ఏపీకి అదనంగా ఇచ్చిందేమీ లేదు: విజయసాయి రెడ్డి