telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హీరో రామ్‌ ఇంట్లో పార్టీ… ఫోటోలు వైరల్‌

హీరో రామ్ ఇటీవల రెడ్‌ మూవీతో ఫుల్‌ బిజీగా ఉండి… కాస్త రిలాక్స్‌ అయ్యాడు. దీంతో తాజాగా..తన ఇంట్లో ఓ చిన్న పార్టీని నిర్వహించాడు. గెట్ టు గెదర్ మాదిరిగా జరిగిన ఈ కార్యక్రమానికి యువ దర్శకులను ఆహ్వానించాడు రామ్. ఈ సందర్భంగా వారంతా కలిసి విందు చేశారు. అనంతరం వారు ఇలా ఫొటోకు స్టిల్ ఇచ్చారు. హీరో రామ్‌ తో పాటు.. కిషోర్ తిరుమల, గోపిచంద్ మలినేని, అనిల్ రావిపుడి, సంతోష్ శ్రీనివాస్, వెంకి కుడుములను ఈ ఫోటోలో చూడవచ్చు. వీరిలో డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్.. రామ్ నటించిన రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు. గోపిచంద్ మలినేని ఒక చిత్రంలో రామ్ ను డైరెక్ట్ చేశాడు. ఇక అనిల్ రావిపుడి రామ్ నటించిన మూడు చిత్రాలకు రచయితగా పనిచేశాడు. కాగా.. రామ్-కిషోర్ తిరుమల కాంబినేషన్లో తెరకెక్కిన ‘రెడ్’ త్వరలో విడుదల కానుంది. ఇక వెంకి కుడుములతో హీరో రామ్ కు సన్నిహిత సంబంధం ఉంది. ఈ విధంగా యువ డైరెక్టర్లంతా ఒక్కచోట చేరి సందడి చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Related posts