ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రాజెక్ట్ చేసేందుకు సిద్దంగా ఉన్నాడన్న ప్రకటన మరింత క్రేజీగా మారింది. ప్రస్తుతం పవన్ బాలీవుడ్ సినిమా పింక్‌ను తెలుగులో వకీల్ సాబ్‌గా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనేక వాయిదాలతో ముందుకు సాగుతోంది. మొదట పవన్ రాజకీయ సమస్యలు, తరువాత మెగా డాటర్ వివాహం తదితర వాయిదాల తరువాత ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. అయితే మెగా డాటర్ నిహారికా వివాహానికి వెళ్లేందుకు పవన్ ఈ సినిమా నుంచి కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్నాడు. పెళ్లి పూర్తయిన తరువాత మళ్లీ చిత్రీకరణలో పాలుపంచుకున్నారు. మొదటగా వచ్చే ఏడాది సంక్రాంతిపోరులో వకీల్ సాబ్ తలపడనున్నాడని అన్నారు. అయితే దాని నుంచి తప్పుకొని వేసవిలో విడుదలకు సిద్దం అవుతోంది. అయితే పవన్ ఈ సినిమా అనంతరం మరో రీమేక్‌లో చేయనున్నాడు. ఈ సినిమా ప్రకటన బయటకు వచ్చింది. మలయాళంలో విజయవంతమైన `అయ్యప్పనుమ్ కోషియమ్`ను సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ తెలుగులోకి రీమేక్ చేస్తోంది. సాగర్ కె. చంద్ర ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.