telugu navyamedia
సినిమా వార్తలు

క‌న్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ స‌దా..ఆ సంఘ‌ట‌నే గుర్తొచ్చి..

2002లో విడుదలైన జయం సినిమాతో సదా వెండితెరకు పరిచయం అయ్యింది. అప్ప‌ట్లో జయం బ్లాక్ బస్టర్ విజయం నమోదు చేసింది. వెళ్ళవయ్యా వెళ్లూ… అంటూ సదా చెప్పిన డైలాగ్ అప్పట్లో ఫుల్ ఫేమస్. తెలుగు, తమిళ్, కన్నడ బాషలలో ఏడాదికి నాలుగైదు సినిమాలు చేసే స్థాయికి వెళ్లారు.

சந்திரமுகி பட வாய்ப்பை இழந்ததால் அழுதேன் - நடிகை சதா - Tamilstar

విక్రమ్ కి జంటగా ఆమె చేసిన అపరిచితుడు ఆమె కెరీర్ లో అతిపెద్ద హిట్.అపరిచితుడు తర్వాత ఆ రేంజ్ హిట్ ఆమెకు తగల్లేదు. బాలయ్య వంటి స్టార్స్ తో అవకాశం వచ్చినా… హిట్ కాకపోవడంతో బ్రేక్ రాలేదు.  అడపాదడపా చిత్రాలు చేసుకుంటూ వస్తున్నారు.

ఇటీవ‌ల కాలంలో సినిమాలు త‌గ్గించారు. ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని ప్రోగ్రామ్స్ లో జడ్జిగా కూడా కనిపిస్తున్నారు.

Sadha Wiki, Biography, Age, Movies List, Family, Images - News Bugz

తాజాగా .. సదా ఓ సినిమా చూస్తూ థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన హృదయానికి ఆసినిమా ఎంతగానో చేరువైందని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Sadha Wiki, Biography, Age, Movies List, Family, Images - wikimylinks

ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ బయోపిక్‌గా తెరకెక్కిన చిత్రం ‘మేజర్‌’. శశికిరణ్‌ తిక్కా దర్శకుడు. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన సదా.. ఫస్ట్‌ హాఫ్​లోనే భావోద్వేగాన్ని కంట్రోల్‌ చేసుకోలేక కన్నీళ్లు పెట్టేసుకున్నారు.

Major' trailer: Adivi Sesh as Major Sandeep Unnikrishnan will awake the  patriot in you | Telugu Movie News - Times of India

ఉగ్రదాడి జరిగిన సమయంలో తాను ముంబయిలోనే ఉన్నానని.. ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే ఆనాటి రోజులు గుర్తుకువచ్చాయని, కొన్ని సన్నివేశాల్లో రోమాలు నిక్కబొడుచుకున్నాయని అన్నారు. శశికిరణ్‌ కథను నడిపించిన విధానం, అడివి శేష్‌ నటన అద్భుతంగా ఉన్నాయని ఆమె కొనియాడారు.

Related posts