telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్

AA19

తాజాగా అల్లు అర్జున్‌, ఇటీవల త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించిన విషయం తెలిసినా. గతంలో వీరి కాంబినేషనలో వచ్చిన జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి సినిమాలు ఘనవిజయం సాధించటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆన్‌ లోకేషన్‌ స్టిల్స్ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. లాంగ్ హెయిర్‌తో ఫార్మల్‌ డ్రస్‌లో కనిపిస్తున్న స్టైలిష్ స్టార్‌ లుక్‌కు సూపర్బ్ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ లుక్స్‌తో పోస్టర్‌లను కూడా డిజైన్‌ చేసి పండగ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్‌. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్‌ బన్నీ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.

Related posts