హీరో అల్లరినరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఈ సినిమాలో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ రోజు నరేశ్ పుట్టినరోజును సందర్భం గా, అతని రాబోయే చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం నిర్మాతలు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
టీచర్ చూస్తే..’ఇవన్నీ ఆదివాసీల గ్రామాలు. వీళ్లలో ఎక్కువమంది జీవితంలో ఓటు వేయని వాళ్లే ఎక్కువ’, ‘సాయం చేస్తే మనిషి, దాడి చేస్తే మృగం.. మేం మనుషులమే సారు.. మీరు మనుషులు అయితే సాయం చేయండి అంటూ ఆనంది డైలాగ్ ఆకట్టుకుంటుంది.
’90 కిలోమీటర్ల మేర అడవి, 150 కిలోమీటర్ల చుట్టుకొలత.. అక్కడికి వెలితే ఎవరూ వెనక్కి తిరిగి రారుస, మాకు జరగాల్సిన న్యాయం జరగకపోతే ఎవర్ని వదలం.. ’25 కిలోమీటర్లు అవతలికి వస్తే గానీ.. వీళ్లెలా బతుకున్నారో మనకే తెలియలేదు. వీళ్లని చూస్తే జాలి పడాలో బాధపడాలో తెలియట్లేదు మాస్టారు అంటూ నరేష్ డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది..

టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఆదివాసీల ఇతివృత్తంతో సాగే ఈ చిత్రంలో.. అల్లరి నరేశ్ ఎన్నికల విధులపై ఓ ఆదివాసి గ్రామానికి వెళ్లే ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. అయితే అక్కడి వారికి ప్రభుత్వ సహాయం లేకపోవడం తో అనేక సమస్యలున్న అటవీ ప్రాంత వాసులు వారిపై దాడికి దిగుతారు.
ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.

