telugu navyamedia
సినిమా వార్తలు

ఆస్పత్రి బెడ్‌పై ప్రకాశ్‌ రాజ్ సెల్ఫీ..

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్ షూటింగ్ సెట్‏లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో ఫ్లోర్‌పై జారిపడ్డారు. దీంతో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లుగా ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, అభిమానులు కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెప్పుకొచ్చారు.

తాజాగా తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు ప్రకాష్ రాజ్. సర్జరీ విజయవంతమయిందని చెబుతూ.. ‘డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. నాపై ప్రేమ చూపించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలో యాక్షన్‌లో దిగుతా’అని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు.

Viral Pic: Prakash Raj Shares His Health Update After Surgery - Sakshi

అలాగే ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న సెల్ఫీ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. అందులో ఆయన ఎడమ చేతి భూజంపై గాయమైనట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.

కాగా, త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మా ఎన్నిక‌ల‌పై ఇండస్ర్టీలో బ‌రిలో ఉన్న వారు ఎవరు గెలుస్తారో అనే విష‌యంపై హాట్ టాపిక్ అయ్యింది.

Related posts