telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రికార్డులు క్రియేట్ చేస్తున్న “లక్ష్మీబాంబ్” ట్రైలర్

Laxmi-Bomb

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటించిన “కాంచన”కు హిందీ రీమేక్ గా “లక్ష్మీ బాంబ్” ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచేశారు. కాంచన చిత్రానికి రీమేక్ గా వస్తున్న ఈ భారీ సినిమా ట్రైలర్ తో మరింత స్థాయిలో భారీ రెస్పాన్స్ ను అందుకుంది. ఈ ట్రైలర్ కు ఏ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది అంటే అన్ని సామజిక మాధ్యమాల్లో ఈ ట్రైలర్ అత్యధికంగా వీక్షించబడిన ట్రైలర్ గా రికార్డు నెలకొల్పింది. ఒక్క యూట్యూబ్ నుంచి ఈ ట్రైలర్ కు 37.2 మిలియన్ వ్యూస్ రాగా మిగతా సామాజిక మాధ్యమాలతో కలిపి మొత్తం 70 మిలియన్ వ్యూస్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇదే మన ఇండియన్ సినిమాలో రికార్డ్. ఈ చిత్రం వచ్చే నవంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డైరెక్ట్ స్ట్రీమింగ్ రిలీజ్ తో పాటుగా పలు దేశాల్లో థియేట్రికల్ రిలీజ్ కానుంది.

Related posts