దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై దానయ్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. ఈ చిత్ర తాజా షెడ్యూల్ బల్గేరియాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నాడు జక్కన్న. ఈ షెడ్యూల్ తర్వాత మరో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరపనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధిచిన వార్తొకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే..ఈ సినిమా కోసం తారక్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్ చెప్పబోతున్నారట. నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడమంటే మామూలు విషయం కాదు. ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30, 2020న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో కొమురం భీమ్ పాత్రలో నటించిన ఎన్టీఆర్ లుక్‌ని అక్టోబర్ 22న కొమురం భీమ్ జయంతి రోజున విడుదల చేస్తారట.
next post
యురేనియం తవ్వకాలపై విజయ్ దేవరకొండ స్పందన ?