telugu navyamedia
సినిమా వార్తలు

కృతి శెట్టి బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ రిలీజ్‌..

ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది ఈ ముద్దు గుమ్మ కృతి శెట్టి. సుకుమార్ శిష్యుడు బుచ్చుబాబు సన దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక మొదటి సినిమాతోనే మెప్పించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.

Kruthi Shetty

తాజాగా హీరోయిన్‌ కృతిశెట్టి నటిస్తున్న సినిమాల్లో ‘శ్యామ్​ సింగరాయ్​ ఒకటి. ప్ర‌స్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. నేడు(సెప్టెంబరు 21) ఈ ముద్దుగుమ్మ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది.

ఇందులో అలా వెనక్కితిరిగి ఓర కంట చూస్తున్న ఓ చిరుమందహాసం విసిరింది కృతి. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. సొట్ట బుగ్గలతో ఆమె ఇచ్చిన స్మైల్ కుర్రాళ్ళ గుండెల్లో బాణాల గుచ్చుకుంటున్నాయి.ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా నాని, సాయిపల్లవి నటిస్తున్నారు. రాహుల్‌ సంకిృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక కృతి శెట్టి నటిస్తున్న మరో సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. ఇటీవలే శ్రీదేవి సోడా సెంటర్ తో వచ్చిన సుధీర్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద‌ర్శకుడు మోహ‌నకృష్ణ ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

Image

త‌ను ప్రేమించిన అమ్మాయిగా న‌టిస్తోన్న కృతి శెట్టి పాత్ర గురించి సుధీర్ బాబు ఏం చెప్పాల‌నుకుంటున్నార‌నేది ఈ చిత్ర కథాంశం.. నేడు ఆ అమ్మాయి (కృతి శెట్టి) పుట్టినరోజు సందర్బంగా చిత్రయూనిట్ బర్త్ డే విషెస్ తెలియజేసింది.

Kruthi

Related posts