telugu navyamedia
సినిమా వార్తలు

అఖిల్ నాలుగో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్

Akhil images

అక్కినేని హీరో అఖిల్ నటించిన “అఖిల్‌”, “హ‌లో”, “మిస్ట‌ర్ మ‌జ్ను” మూడు చిత్రాలూ ఆయనకు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ చిత్రాల త‌ర్వాత అక్కినేని అఖిల్ కథానాయకుడుగా న‌టిస్తోన్న నాలుగో సినిమా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా తెర‌కెక్కుతోంది. అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై బ‌న్నీవాసు, వాసువ‌ర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జూలై 15న సోమవారం హైద‌రాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఎప్పుడో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ కాస్త డిలే అయ్యింది. హైద‌రాబాద్ కూక‌ట్ ప‌ల్లి ప‌రిస‌ర ప్రాంతాల్లో అఖిల్‌పై కొన్ని స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. ఈ సినిమాలో అఖిల్ స‌ర‌స‌న న‌టించ‌బోయే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఇంకా ఖ‌రారు కాలేదు. రెండో షెడ్యూల్‌ స్టార్ట్ అయ్యే సమయానికి హీరోయిన్‌ను ఫైన‌లైజ్ చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మరి అఖిల్ ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో చూడాలి.

Related posts