దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో “ఆర్ఆర్ఆర్” అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 70 శాతం పూర్తైందని ఇటీవల మేకర్స్ తెలిపారు. అయితే చిత్రంలో చరణ్ సరసన కథానాయికగా అలియా భట్, ఎన్టీఆర్‌కి జోడీగా ఓలివియా మోరిస్‌పై సనటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం విడుదల ఆలస్యం కావొచ్చు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ ఈ చిత్రాన్ని 2021, జనవరి 8న విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌కు అజయ్ హాజరయ్యారు. ఈ సినిమాలో నటిస్తున్నందుకు రెమ్యునరేషన్ తీసుకోకూడదని అజయ్ నిర్ణయించుకున్నారట. అజయ్‌కు ఇవ్వాల్సిన పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగానే ఉన్నప్పటికీ, ఆయన మాత్రం `నో రెమ్యునరేషన్` అంటున్నారట. స్నేహితుడి కోరిక మేరకు ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తున్నానని, దానికోసం పారితోషికం తీసుకోనని అజయ్ స్పష్టం చేశారట.
next post
ప్రభాస్ నా కొడుకు… అనుష్క కామెంట్స్ వైరల్