telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఏకంగా 1500 కోట్ల క్లబ్‌లో… సోనాక్షి సిన్హాకు అరుదైన గౌరవం… !!

Sonakshi-Sinha

సీనియర్ నటుడు, రాజకీయనేత శత్రుఘ్న సిన్హా కూతురు అయిన సోనాక్షి తన ప్రొఫెషన్‌లో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ కలెక్షన్ల పరంగా అదరగొట్టాయి. ఏకంగా 1500 కోట్ల క్లబ్‌లో చేరాయి. ఇప్పటివరకు ఏ హీరోయిన్‌ సినిమాలు కూడా ఇన్ని కోట్ల క్లబ్‌లో చేరలేదట. 2010లో వచ్చిన ‘దబాంగ్’ సినిమాతో సోనాక్షి సినీ ప్రవేశం చేశారు. స్టార్ కిడ్ కాబ్టటి తొలి సినిమాలోనే సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించే అవకాశం దక్కించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 141.25 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత సోనాక్షి నటించిన ‘రౌడీ రాథోడ్’ (133.25 కోట్లు), ‘సన్ ఆఫ్ సర్దార్’ 105.03 కోట్లు, ‘దబాంగ్ 2’ (155 కోట్లు), ‘హాలిడే’ (112.45 కోట్లు), ‘ఇత్తేఫాక్’ (30.19 కోట్లు), ‘మిషన్ మంగళ్’ (208.05 కోట్లు) రాబట్టాయి. సోనాక్షి కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌గా నిలిచిపోయిన సినిమాలు ఇవే. తాను ఈ ఘనత సాధించడానికి అభిమానులే కారణం అంటూ సోనాక్షి ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. “నేను ఎంచుకున్న ప్రొఫెషన్‌లో ప్రాణం పెట్టి పనిచేస్తాను. రోజూ ఏదో ఒక కొత్తదనం ఉండాలని కష్టపడుతుంటాను. గత తొమ్మిదేళ్ల నా కెరీర్‌లో నేను ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చింది ఇదే. ఇన్నేళ్లలో నేను తెలుసుకున్నది ఏంటంటే.. గాడ్‌ఫాదర్స్ అవసరం లేదు, అవార్డులతో పని లేదు, ఫేక్ ఫ్రెండ్స్ అవసరం లేదు, హార్డ్‌వర్క్‌ కాకుండా మరో ఆప్షన్ లేదు. నేనేంటో నా పని ద్వారానే నిరూపించుకున్నాను. నా గురించి చాలా మంది ఎన్నో మాటలు అన్నారు. అవమానించారు. కానీ వాళ్లే నాలో కసి పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేశారు. అభిమానుల ప్రేమాభిమానాలు లేకపోతే ఈ 1500 కోట్లు కేవలం అంకెలే. మీ నిజమైన ప్రేమ నాకు ఎల్లప్పుడూ కావాలి” అని తెలిపారు.

Related posts