బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ తాజాగా కొన్న కారు విలువ తెలిస్తే షాకవ్వాల్సిందే. ఈ బాలీవుడ్ హీరో, నిర్మాత రోల్స్ రాయల్ కార్లలో ఖరీదైన కారు కలినన్ యస్.యు.వి మోడల్‌ను కొనుగోలు చేశారు. దీని ధర ఏకంగా రూ.6.95 కోట్లు. ఇప్పటి వరకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ వద్ద మాత్రమే ఈ ఖరీదైన కారుండేది. ఇప్పుడు ఇలాంటి ఖరీదైన కారున్న వ్యక్తుల్లో అజయ్ ఇండియాలోనే మూడో వ్యక్తి అయ్యారు. ప్రస్తుతం ఈయన స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న “మైదాన్” చిత్రంలో నటిస్తున్నారు. గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ఇండియన్ ఫుట్‌బాల్ అని చెప్పుకునే 1952-62 సమయంలో ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కోచ్‌గా పనిచేసిన సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ ఇది. ఇందులో ఏషియన్ గేమ్స్‌లో ఇండియన్ టీమ్‌ను విజేతగా నిలపడానికి సయ్యద్ కష్టాన్ని తెరపై ఆవిష్కరించనున్నారు. సయ్యద్ పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తుంటే.. ఆయన జతగా కీర్తి సురేశ్ నటిస్తున్నారు. బోనీకపూర్, ఆకాశ్ చావ్లా, అరుణవా జోయ్ సేన్గుప్త, జీ స్టూడియస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక తెలుగులో అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం “ఆర్ఆర్ఆర్”లోనూ నటిస్తున్నారు.
previous post