telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ ఆఫర్ ను తిరస్కరించిన అనుష్క ?

Anushka

ప్రస్తుతం ఇండస్ట్రీలో వెబ్ సిరీస్ ల హవా నడుస్తోంది. స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. అంతేకాకుండా వెబ్ సిరీస్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుంది. కాబట్టి హాట్ సీన్లు ఉన్నా సెన్సార్‌ ఇబ్బందులు లేకుండా రిలీజ్ చేయొచ్చు. ఓటీటీ కారణంగా డిజిటల్ ప్లాట్ ఫామ్ శరవేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలు చిత్రాలు ఓటీటీ ద్వారా విడుదలై… మంచి లాభాలను గడించాయి. మరోవైపు వెబ్ సిరీస్ లకు క్రేజ్ అమాంతం పెరుగుతోంది. ఇప్పటికే పలువురు టాప్ యాక్టర్స్ వెబ్ సిరీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించారట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా ఆమె తిరస్కరించినట్టు సమాచారం. అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయడానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related posts