ప్రముఖ నటుడు మాధవన్ ఓ నెటిజన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాఖీ పండుగ సందర్భంగా తన కుమారుడు, తండ్రితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మాధవన్. ఈ ఫోటోలు ముగ్గురు జంద్యం వేసుకొని సాంప్రదాయబద్ధంగా కనిపించారు. అయితే ఈ ఫోటోని నిశితంగా పరిశీలించిన జిక్సా అనే మహిళ నెటిజన్ “మీ పూజ గదిలో శిలువ ఎందుకు ఉంది. దాని వలన మీపై నాకు గౌరవం పోయింది. చర్చిలో హిందూ దేవుళ్లు కనిపించరు. కాని హిందూ దేవుళ్లు ఉన్న మీ పూజ గదిలో శిలువ పెట్టారంటే అర్ధం ఏమిటి? మీరు హిందూ సాంప్రదాయాలని ఆచరిస్తున్నారనేది అబద్దం. ఈ ఫోటో ఫేక్” అంటూ ఆ ఫోటోపై తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. దీనికి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు మాధవన్. “మీకు పట్టిన మత పిచ్చి త్వరగా నయం కావాలని కోరుకుంటున్నాను. మీ లాంటి వాళ్ళ గౌరవం నేను కోల్పోవడం వలన నాకు వచ్చే నష్టం ఏమి లేదు. నా దృష్టిలో అన్ని మతాలు సమానమే. అందరికి నా ఇంట్లో ప్రవేశం ఉంటుంది. మీకు కనిపించలేదనుకుంటా. ఆ ఫోటోలో గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది. అలాగని నేను సిక్కిజమ్ స్వీకరించలేదు కదా.. గుడి, చర్చ్, దర్గా దేనికైనా వెళ్లడం నాకు దొరికిన మంచి అవకాశంగా భావిస్తా. ఎందుకంటే నాకు నీలాంటి జబ్బు లేదు” అంటూ సమాధానం ఇచ్చారు మాధవన్. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
🙏🙏🙏 https://t.co/Imw3SqR2Zb pic.twitter.com/x79cX50aRn
— Ranganathan Madhavan (@ActorMadhavan) 16 August 2019
కత్రినా నన్ను వదిలేసింది… సల్మాన్ వ్యాఖ్యలు