ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాలు స్తంభించాయి.ఎయిర్ ఇండియాకు చెందిన ప్రధాన సర్వర్‌లో సమస్య తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. విమానాశ్రయాల నుంచి ఫోటోలు, వీడియోలను ప్రయాణికులు షేర్ చేస్తున్నారు.
ఎయిర్ ఇండియాకు చెందిన ఎస్ఐటీఏ సాఫ్ట్‌వేర్ పనిచేయడం లేదు. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముంబై విమానాశ్రయంలో సుమారు 2వేల మంది ప్యాసింజెర్లు ఎదురుచూస్తున్నారు. చెకిన్ ఏరియాలోనే ప్రయాణికులు ఉండిపోయారు. సాఫ్ట్‌వేర్ స్తంభించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఎయిర్ ఇండియా చైర్మన్ అశ్వాని లోహని తెలిపారు. సాంకేతిక సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు.
వైయస్ హయాంలోనే విశాఖ అభివృద్ధి: బొత్స