జూనియర్ ఎన్టీఆర్ రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ ఎప్పుడప్పుడు థియేటర్లకు వస్తుందా అని సినిమా ప్రేక్షకులంతా ఎదురు చూస్తున్న సినిమా ఈ ఏడాది అక్టోబరు 13 విడుదల కావట్లేదని, వచ్చే ఏడాది వేసివిలో కనివిందు చేయనుందని ఒక వార్త టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీంతో అభిమానులకు మరింత నీరక్షణ తప్పదు అనిపిస్తుంది.

క రోనా ప్రభావం సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టం కలిగించిది. కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ముగిసిన, కొన్ని థియేటర్లు తెరచుకున్నప్పటికీ పూర్తిగా థియేటర్లు తెరవని కారణంగా చాలా సినిమాలు విడుదలను తేదీలను వాయిదా వేసుకుంటూ వస్తున్నాయి. ఇపుడు అరకొర చిన్న చిన్న సినిమాలు విడుదలైనప్పటికీ, పాన్ ఇండియా సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకుంటూనే వస్తున్నాయి.

ఇటీవల ఉక్రెయిన్ లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పూర్తి చేసుకొని వచ్చింది. అయితే ఇంకా బ్యాలన్స్ షూట్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల కారణంగా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని నిర్ణయించుకున్న మేకర్స్ వచ్చే ఏడాదికి ఉగాదికి విడుదలకు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.



“అర్జున్ రెడ్డి” దర్శకుడిపై సెలెబ్రిటీలు ఫైర్… వివరణ ఇచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా