telugu navyamedia
సినిమా వార్తలు

“అర్జున్ రెడ్డి” దర్శకుడిపై సెలెబ్రిటీలు ఫైర్… వివరణ ఇచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా

Sandeep-reddy-vanga

తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌ రెడ్డి” రీమేక్‌ “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “కబీర్‌ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరిచారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండ‌ద‌ని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. `అర్జున్ రెడ్డి` ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ వ్యాఖ్య‌లపై ప‌లువురు హీరోయిన్లు, మ‌హిళా జ‌ర్న‌లిస్టులు అభ్యంతరం వ్య‌క్తం చేశారు. సందీప్ వ్యాఖ్య‌ల‌తో విభేదిస్తున్న‌ట్టు స‌మంత ట్వీట్ చేసింది. అలాగే చిన్మ‌యి శ్రీపాద‌, గుత్తా జ్వాల‌, అన‌సూయ వంటి సెల‌బ్రిటీలు కూడా సందీప్ వ్యాఖ్య‌ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో త‌న వ్యాఖ్యల‌ను మీడియా అర్థం చేసుకుందంటూ సందీప్ వివరణ ఇచ్చారు. “నా వ్యాఖ్య‌ల‌ను మీడియా తప్పుగా అర్థంచేసుకుంది. అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు తమలోని అన్ని కోణాలను బయటపెట్టకపోతే ఆ బంధంలో ఎమోషన్‌ ఉండదని అన్నాను. అంటే దాన‌ర్థం యువకుడు రోజూ తాగి వచ్చి యువతిపై చేయి చేసుకోవాలని కాదు. నేను మహిళల తరఫున, పురుషుల తరఫున సమానంగా మాట్లాడాను. ఎవ్వరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ దురదృష్టవశాత్తు నా భావాన్ని తప్పుగా అర్థంచేసుకున్నారు” అని తెలిపారు.

Related posts