అడ్డసరం (Adhatoda vasica or Justicia adhatoda) ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం అడహతోడ వాసికా నీస్. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే పొద. ఈ మొక్కకు ఆకర్షణీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు :
దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి. అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు. దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయోగకరమైనవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణకు వాడతారు. ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి. గోరువెచ్చని ఈ ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు తగ్గిపోతాయి. అడ్డసరము కషాయమును తగ్గించినా మంచి ఫలితం ఉంటుంది. నరముల రోగాలు, పట్లు, నొప్పులు హరించును. నీళ్ళవిరేచనములు తగ్గుతాయి. నేత్రరోగహరముగా పని చేస్తుంది.