telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్‌పై సంజన గల్రానీ ఆసక్తికర వ్యాఖ్యలు..

టాలీవుడ్‌లో యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నటి సంజన గాల్రానీ. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ.. ఈ అమ్మడుకి పెద్దగా అవకాశలు రాలేదు. కోలీవుడ్‌లో సెటిల్‌ అయిన సంజన పలు వివాదలతో సోషల్‌ మీడియాలో నిలుస్తుంది. ఇటీవలే డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంజన నటిగానూ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంజన మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ‘బుజ్జిగాడు’ చిత్రంలో ప్రభాస్ తో కలిసి వర్క్ చేయడం గురించి మాట్లాడిన సంజన ప్రభాస్ చాలా డెడికేటెడ్ యాక్టర్‌. అతను ఒక రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన.. కష్టపడే వ్యక్తి. అతని ఫిజిక్ చూస్తే అర్థం అవుతుంది ఎంత హార్డ్ వర్క్ చేసాడు అనేది. దీని కోసం ఆయన తినే ప్రతీ దానిపై చాలా కేర్ తీసుకున్నాడు. ఆ టైంలో ప్రభాస్ కేవలం పెసరట్టు మాత్రమే తిని జీవించాడు అని చెప్పుకొచ్చింది.

ప్రభాస్‌ ‘బాహుబలి’ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన చేసేవి సినిమాలు ‘రాధే శ్యామ్’, ‘ప్రాజెక్ట్ K’ , ‘సలార్’ , ‘ఆదిపురుష్’ ఇవి అన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలే. రాధే శ్యామ్‌ 2022 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Related posts