telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటిటిలో జాన్వీ కపూర్ సినిమా

Gunjan

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ యుద్ధఫైలట్‌గా నటిస్తున్న చిత్రం ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’. ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గర్ల్’ చిత్రంలో జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రలో నటించగా, పంకజ్‌ త్రిపాఠి ఆమె తండ్రిగా, అంగద్‌ బేడీ సోదరుడిగా నటిస్తున్నారు. అమిత్‌ త్రివేది సంగీత స్వరాలు సమకూరుస్తున్నాడు. శరణ్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని త్వరలోనే ‘నెట్‌ప్లిక్స్’లో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటికే చిత్ర టీజర్‌ విడుదల కాగా ఇది గుంజన్ సక్సేనాని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా ఆగస్టు 12న నెట్‌ ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అదే విధంగా ఈ సినిమాకు సంబంధించిన మూడు మోషన్‌ పోస్టర్లను జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు.

Related posts