telugu navyamedia
క్రైమ్ వార్తలు

మంగినపూడి బీచ్ లోవ్యభిచారం… 8 జంటలు అరెస్ట్

కృష్ణా జిల్లాలో సుప్రసిద్ధ పర్యాటక స్థలంగా మంగినపూడి బీచ్ కు పేరుంది. మచిలీపట్నం సమీపంలోని ఈ బీచ్ కు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఇటీవలి కాలంలో మంగినపూడి బీచ్ లోని ఓ రిసార్ట్ విశృంఖల వ్యభిచారానికి కేరాఫ్ అడ్రెస్ గా మారింది. గంటల చొప్పున అద్దె వసూలు చేస్తూ, గుట్టు చప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండడం పట్ల పోలీసులు తీవ్రంగా స్పందించారు.

ఈ రోజు పోలీసులు ఆ రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. మచిలీపట్నం రూరల్ పోలీసులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. పోలీసుల రాకను గమనించిన కొన్ని జంటలు పక్కనే ఉన్న తోటల్లోకి పరుగులు తీశాయి. ఈ దాడుల్లో ఎనిమిది జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరు ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఈ రిసార్ట్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న వారికి, వ్యభిచారులకు నెలవుగా ఉంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిసార్ట్‌ నడిపే వ్యక్తి మచిలీపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు రూంలను గంటల లెక్కన అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

Related posts