telugu navyamedia
సినిమా వార్తలు

ప్రభాస్‌తో కప్పు కాఫీ తాగినా చాలు: దివి

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి వైద్య‌ తన అందచందాలతో యూత్‌లో మంచి క్రేజ్‌ను తెచ్చుకుంది. ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఫ్యాన్స్‌కి ఎప్పుడు టచ్‌లో ఉంటుంది. ప్రస్తుతం వరుస ఆఫర్లతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ అమ్మడు. తాజాగా ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరో ప్రభాస్‌ తన అంటే ఎంతో ఇష్టమని, ఒక రకంగా చెప్పాలంటే ఆయనంటే క్రష్‌ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్‌ అయిపోయానని, అప్పటి నుంచి ఆయనకు ఐ లవ్‌ యూ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లు చేస్తుండేదాన్ని అని పేర్కొంది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని, మిర్చి లాంటి అబ్బాయితో కప్పు కాఫీ తాగినా చాలని ఫ్యాన్‌ మూమెంట్స్‌ను షేర్‌ చేసుకుంది.

Related posts