టాలీవుడ్ చిత్రం అర్జున్ రెడ్డి తమిళం, హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. హిందీలో షాహిద్ కపూర్ టైటిల్ రోల్ పోషిస్తుండగా,తమిళంలో విక్రమ్ తనయుడు ధృవ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన గిరీశాయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. ‘ఆదిత్యవర్మ’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2019, జూన్‌లో ఈ విడుదల చేస్తాము అని నిర్మాణ సంస్థ గతంలో తెలిపిన విషయం విదితమే.
ఒరిజినల్ వర్షెన్‌కి సంగీతం అందించిన రధన్ ఈ చిత్రానికీ సంగీతం సమకూరుస్తున్నారు. ఇక సినిమాటోగ్రాఫర్‌గా రవి కె చంద్రన్ పని చేస్తున్నారు. ధృవ్ విక్రమ్ సరసన అక్టోబర్ చిత్ర ఫేం బానిటా సందు హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా చిత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులో ధృవ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. చిత్రాన్ని తమిళ నేటివిటీకి అనుగణంగా కొంత మార్చినట్టు తెలుస్తుంది. టీజర్ మాత్రం చిత్రంపై భారీ అంచనాలే పెంచిందని చెప్పవచ్చు. ఈ4 ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ మరో హీరోయిన్‌గా నటిస్తుంది.