యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఛపాక్”. ఈ చిత్రం జనవరి 10న విడుదల కానుంది. సినిమాకు నిర్మాతగా కూడా దీపిక వ్యవహరించారు. ఇందులో మాల్తీ పాత్రలో కనిపించనుంది. కాగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణే ఆదివారం రోజు తన 34వ బర్త్‌డే వేడుకలు జరుపుకుంది. తాను యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత నేపథ్యంలో చిత్రం చేసిన నేపథ్యంలో యాసిడ్ దాడిలో గాయపడిన మహిళలతో కలిసి లక్నోలో పుట్టిన రోజు జరుపుకుంది. రణ్‌వీర్ సింగ్, ఛపాక్ చిత్ర దర్శకులు మేఘనా గుల్జార్, విక్రంత్ మస్సే, లక్ష్మీ అగర్వాల్‌తో పాటు పలువురు ప్రముఖులు బర్త్‌డే వేడుకలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. బాలీవుడ్ ఇండస్టీతోపాటు అటు ప్రముఖుల నుంచి దీపికాకు భర్త్‌డే విషెస్ హోరెత్తాయి. కత్రినా కైఫ్, అలియాభట్, మాధురి దీక్షిత్, తమన్నా బర్త్‌డే విషెస్ తెలిపారు.
previous post
next post
అమితాబ్ తో రిలేషన్ గురించి రేఖ కామెంట్స్