నవ మల్లికా!
నా హృదయ దీపికా!
నా ప్రేమ హారికా!!
తనువులోని అందాలతో
కనువిందు చేస్తావు
మందహాసంతో ప్రేమవిందు చేస్తావు
అధరాల మందారాలతో
మాలలు చేసి మెడలో వేస్తావు
వదన వనమున పూసిన సిగ్గు,బిడియాలతో  మనసు దోస్తావు
వలపుల ఊహల ఉయ్యాలో ఊరేగుతావు
ఊహకందని ప్రేమ హావభావాలతో ముద్దుచేస్తావు
 వెన్నెల్లా ఆరబోసిన పరువాలే 
నా మదికి వేడుకలే!!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు



దాని కోసమే పెళ్ళి చేసుకున్నా… బోల్డ్ హీరోయిన్ కామెంట్స్