telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్‌ బాస్‌ షోకి… మరో హీరో!

Sudeep

తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎంతగానో పొందిన తెలుగు బిల్లితెర షో బిగ్ బాస్. ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ నడుస్తోంది. అయితే ఇందులోని కంటెస్టెంట్‌ల మధ్య గొడవలు, వారు చేసే అల్లర్లు, లవ్ ట్రాక్‌లతో ఎంతో ఇంటరెస్టెంగా కొనసాగుతోంది. మరో మూడు వారాల్లో ఈ షో తన నాలుగో సీజన్‌ను పూర్తెచేసుకోనుంది. మరి ఇందులో విజేతగా ఎవరి పేరు వినిపిస్తుందా అని ప్రేక్షకులలో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రస్తుతం టాప్ హీరోలు తమ సినిమాలను ప్రమోట్ చేసుకోడానికి అనేక షోలకు వెళ్లేవారు. బిగ్ బాస్ వచ్చాక చాలా మంది హీరోలు దీనిపై మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ సీజన్‌ మాత్రం కాస్త తక్కవ మంది తారలతో ముగింపుపలకనుంది. దానికి కారణం కరోనానే అని చెప్పుకోవచ్చు. ఇటీవల మళ్లీ సినిమాలు వాటి షూటింగ్‌లను పునరుద్దరించడంతో హీరోలు ప్రమోట్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది దసరాకు అఖిల్ అక్కినేని ఈ వేదిక పై తన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను ప్రమోట్ చేసుకున్నాడు. ఈ రోజు ఈ వేదికపైకి కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ రానున్నాడు. సుదీప్ తన తాజా చిత్రం ఫాంథమ్ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్ బాస్‌కు హాజరుకానున్నాడు. గ్రీకు వీరుడు నాగ్‌తో కలిసి అందరిని అలరించేందుకు సిద్దమయ్యాడు. ఈ షోకు హాజరయిన విషయాలను సుదీప్ తెలిపాడు. అయితే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ ఈరోజు కానుంది.

Related posts