సౌత్ హీరోయిన్ హన్సిక వ్యక్తిగత ఫోటోలు నిన్న లీకైన విషయం తెలిసిందే. ఈ ఫోటోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్ విహారయాత్రలో ఉన్న హన్సిక ఈ విషయంపై స్పందించింది. తన ఫోన్, ట్విట్టర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని, వాటి నుంచి వచ్చే సందేశాలను స్పందించవొద్దంటూ తన అభిమానులను కోరింది హన్సిక. ప్రస్తుతం తన టీం దీనిని సరిదిద్దే ప్రయత్నంలోనే ఉన్నారని, త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయని తెలిపింది.
అయితే ఎవరైనా నిజంగానే హన్సిక ట్విట్టర్ ను హ్యాక్ చేస్తే ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాలి కదా… ఎందుకు లీగల్ యాక్షన్ తీసుకోవడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం హన్సికకు ఇప్పుడు తగినంత క్రేజ్ లేకపోవడంతో తన ఫోటోలను తనే స్వయంగా లీక్ చేసిందని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుతం ట్విట్టర్ లీకైన హన్సిక ఫోటోలు మొత్తం డిలీట్ అయ్యాయి. గతంలో అభిషేక్ బచ్చన్, అక్షర హాసన్, షాహిద్ కపూర్ తదితరుల ఫోటోలు లీకైన విషయం తెలిసిందే.
భర్తను అవమానించిన వారికి గడ్డి పెట్టిన సింగర్ సునీత