ఈమె హీరోయిన్‌కు ఏమాత్రం తగ్గని అందం, అంతకమించి తన గాత్రంతో అందరినికట్టిపడేస్తుంది సింగర్ సునీత. చిత్రపరిశ్రమలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ, సింగర్‌గానూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకుంది.
ఇటీవల వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుని సంతోషంగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది. రెండో పెళ్లి తరువాత సునీత నెట్టింట్లో మరింత యాక్టివ్‌గా అయ్యారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్, వీడియోస్, తన భర్త రామ్ వీరపనేనితో కలిసి దిగిన ఫోటోలను కూడా సునీత షేర్ చేస్తూ.. నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నారు.
అయితే సోషల్ మీడియాలో తన మీద వచ్చే నెగెటివ్ కామెంట్లను అంతగా పట్టించుకోరు. కానీ అవి శ్రుతి మించిన సమయంలో మాత్రం తనదైన స్టైల్లో స్ట్రాంగ్ కౌంటరిస్తుంది. తాజాగా తన భర్త రామ్ వీరపనేని గురించి ఓ నెటిజన్ చేసిన కామెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది సునీత.
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహం వద్ద సునీత తన భర్తతో కలిసి వెళ్లారు. సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ తన భర్తతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. ఇక వీరి ఫోటోపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందించారు. అందులో ఓ నెటిజన్ సునీత భర్తపై నెగిటివ్ కామెంట్స్ చేశాడు.
కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలిరామ్ మొగుడు.. అందం ఆమె సొంతం.. ధనము ఆయన సొంతం. గానం ఈవిడది, దర్జా అతనిది అంటూ ఇష్టానుసారంగా వాగేశాడు. ఈ కామెంట్ చూసిన సునీత అతనికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. నోటి దూల నీది.. నీ భారం భూమిది అంటూ సునీత రివర్స్ కౌంటర్ వేశారు.
అయితే సునీత ఇచ్చిన ఈ కౌంటర్‌కు నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. సరిగ్గా గుణపాఠం చెప్పారంటూ సింగర్ సునీత ఎంకరేజ్ చేస్తున్నారు.
అసభ్య పదజాలంతో నాగబాబు వివాదాస్పద వ్యాఖ్యలు