కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చి ఉచిత వైద్యం అందించాలని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. రాష్ట్రలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన భద్రాచలం ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.
కరోనా సమయంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఏరియా ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న డాక్టర్లు,నర్స్ ల పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ప్రజలను గాలికి వదిలేసి సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని మండిపడ్డారు. కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.


ఈ ఎన్నికల్లో టీడీపీకి భారీ ఎదురుదెబ్బే తగిలింది: నారా భువనేశ్వరి