సూపర్ స్టార్ మహేష్ బాబు ఆదివారం తన 45వ బర్త్‌డేని జరుపుకున్నారు. మహేష్ బాబు పుట్టినరోజుకి గాను అయన అభిమానులు, పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా 24 గంటలలో హెచ్బీడీమహేష్బాబు అనే ట్యాగ్‌తో 60.2 మిలియన్ ట్వీట్స్ వచ్చాయి. తమ అభిమాన నటుడు బర్త్‌డే ట్యాగ్‌ని ట్రెండ్ చేసి మహేష్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు ఫ్యాన్స్. ఇది వరల్డ్ రికార్డుగా సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న “సర్కారు వారి పాట” సినిమా నుంచి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చాడు.. గీతా గోవిందం ఫేం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తుంది..ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు.
నాపై విమర్శలు… నటనతోనే చెక్ పెడతా : కార్తికేయ