తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేప్థ్యంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. వాస్తవానికి తెలంగాణలో రేపటి నుంచి పలు ఎంట్రెన్స్ టెస్టులు జరగాల్సి ఉంది. కీలకమైన ఎంసెట్ పరీక్షలకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.
కరోనా మహమ్మారి విజృభింస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశపరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లా సెట్, పాలీసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్ సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి.
ఆర్థిక మందగమనం భారత్ కు పెద్ద సమస్యగా మారనుంది: మాయావతి