డీజీపీగా పదోన్నతి రాలేదన్న మనస్తాపంతో తెలంగాణ పోలీస్ అకాడమీ సంచాలకులు వీకే సింగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పదవీ విరమణ చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆయన తన రాజీనామ లేఖను పంపించారు. తాను 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారినని తన లేఖలో వీకే సింగ్ ప్రస్తావించారు. పోలీసు శాఖలో సంస్కరణలు తేవాలని భావించానని, కానీ ఆశయ సాధనలో విఫలమయ్యాయనని ఆయన వాపోయారు.
దశాబ్దాల తన సర్వీసులో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, స్పష్టమైన మనస్సాక్షితో విధులు నిర్వహించానని ఆయన తెలిపారు. కష్టపడటం, నిజాయితీతో ఉండటంతో విజయాలను సాధించవచ్చని గ్రహించానని, ఎవరైనా పోలీసు ఉద్యోగంలో చేరాలని భావిస్తే, పోలీసు శాఖలోనే చేరాలని సూచించారు.
రెడ్డి క్యాస్ట్ కాదు అదొక ఒక టైటిల్..మాజీ ఎంపీ తులసి రెడ్డి సంచలన వ్యాఖ్యలు