telugu navyamedia
తెలంగాణ వార్తలు

హుజూరాబాద్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం..

రేపు జ‌ర‌గ‌నున్న హుజురాబాద్ ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంద‌ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్​ గోయల్​ తెలిపారు.

Thumbnail image

చాలా చోట్ల చెక్‌పోస్టులు పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నారని. నేతల వాహనాలను సైతం చెక్‌ చేశారు. 20 కంపెనీల కేంద్ర బలగాలు, 4 వేల మంది రాష్ట్ర పోలీసులు బందోబస్తులో ఉన్నారు.306 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 127 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ కేంద్ర బలగాలతోపాటు లోకల్ పోలీస్ లతో భద్రత ఏర్పాటు చేశామ‌ని అన్నారు. పోలింగ్‌ సిబ్బంది సామగ్రితో కేంద్రాలకు చేరుకున్నారు.

 రేపు జరగనున్న పోలింగ్‌లో భాగంగా మొత్తం 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్‌లు తమ ఓటు హక్కును,[object Object],వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళలు ఒక లక్ష 19 వేల 102 మంది కాగ పురుషులు ఒక లక్ష 17 వేల 933 మంది ఉన్నారు. ఇతర కేటగిరీ లో ట్రాన్స్ జెండర్ ఒకరు ఉండగా ,సర్వీస్ ఓటర్ లు 149 మంది ఎన్నారై లు 14 మంది ఉన్నారు.

2018 ఎన్నికల్లో 84.5 శాతం ఓటింగ్ నమోదు అయింది. ఈసారి ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని శశాంక్ గోయల్ స్పష్టం చేశారు. అలాగే.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ఓటర్లు తప్పకుండా మాస్క్ పెట్టుకోవాల‌ని, ఫిజికల్ డిస్టన్స్ పాటించాల‌ని పోలింగ్‌ సూచించారు.

కాగా..హుజురాబాద్ నియోజకవర్గంలో 5 మండలాలు 106 గ్రామాలు ఉన్నాయి. 30 మంది పోటీలో ఉన్నారు. 2 లక్షల 37 వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. మహిళలు లక్షా 19వేల 102మంది, పురుషులు ఒక‌లక్షా 17వేల 993మంది, ఇతర కేటగిరీ లో ట్రాన్స్ జెండర్ ఒకరు ఉండగా ,సర్వీస్ ఓటర్ లు 149 మంది ఎన్నారై లు 14 మంది ఉన్నారు.

 ఇవే కాకుండా ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తిన , లేక అవి పని చేయక పోయిన అన్ని కలిపి అదనంగా 603 రిజర్వ్‌లో ఉంచారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగ నుండగా.. పోలింగ్ సమయం‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు చేపట్టారు.

పోలింగ్ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది 1715 మంది అధికారులు ఇప్పటికే రెండు డోస్ ల కోవిడ్ టీకా తీసుకోవడం తో పాటు ఆర్టీపిసిఅర్ కోవిడ్ టెస్ట్ చేయించుకొని దృవపత్రం సమర్పించాలని ఎన్ నికల అధికారులు ఆదేశించారు.

Related posts