telugu navyamedia
సినిమా వార్తలు

పునీత్ రాజ్‌కుమార్ చివ‌రి ట్వీట్ వైర‌ల్‌..

కన్నడలో ‘పవర్‌ స్టార్‌’ గా అంతులేని అభిమానం సొంతం చేసుకున్న పునీత్ రాజ్‌కుమార్‌ హఠాన్మరణం అందరినీ సోక‌సంద్రంలో ముంచింది. శుక్రవారం ఉదయం జిమ్‌ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిన ఆయనను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావటంతో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వైద్యులు వెల్లడించారు. నటుడిగా నేపథ్య గాయడకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యతగా, ఆడియో కంపెనీ ఓనర్‌గా, నిర్మాతగా ఎన్నో రంగాల్లో కన్నడ ఇండస్ట్రీకి పునీత్ రాజ్‌కుమార్‌ సేవలందించారు.

E-Conclave Corona Series: Puneeth Rajkumar talks about how he is dealing with the lockdown - Movies News

అయితే పునీత రాజ్ కుమార్ కి అన్న శివరాజ్‌కుమార్ అంటే ప్రేమ, గౌరవం.. అలాంటి తన అన్న కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాల్లో భజరంజీ కూడా ఒకటి. ఇప్పుడు అదే సినిమాకు సీక్వెల్ సిద్ధమయింది. ‘ భజరంగి2’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా ఈరోజు (అక్టోబర్‌29) విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. తన అన్నయ్య, హీరో శివ రాజ్‌కుమార్‌ నటిస్తున్న భజరంగీ 2 మూవీ విజయం సాధించాలని మూవీ టీంకు బెస్ట్ విషెస్ చెబుతూ పునీత్‌ లాస్ట్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

కాగా..పునీత్ మరణం అనంతరం ఆయన సోషల్ మీడియా ఖాతాలను పలువురు  పోస్టులు సెర్చ్‌ చేస్తున్నారు. దీంతో ఆయన చేసిన ఆఖరి ట్వీట్‌, మాటలు, ఇంటర్వ్యూలు వైరల్‌ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే..‘ భజరంగి2’ పనుల్లో పడి పునీత్ రాత్రి సరిగ్గా నిద్ర కూడా పోలేడని.. ఆ ఒత్తిడితోనే వ్యాయాయం చేశాడని..ఈ టెన్షన్ లోనే గుండెకి ప్రమాదం జరిగి ఉండొచ్చని కన్నడ సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి.

 

 

Related posts