ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన “పేట” చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం వారం రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 150 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రంలో రజనీకాంత్ మరింత యంగ్ గా,స్టైలీష్ గా కన్పించారు. ఇక మాస్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉండటంతో మంచి హిట్ సాధించింది “పేట”. దీంతో రజినీకాంత్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గత కొంతకాలంగా రజినీకాంత్ నటించిన చిత్రాలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. భారీ అంచనాలతో వచ్చిన కబాలి, కాలా, 2.0 చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. ఆ లోటును “పేట” తీర్చిందనే చెప్పొచ్చు. 
							previous post
						
						
					
							next post
						
						
					


అక్రమ సంబంధాలు సాధారణమే… దర్శకుడి వివాదాస్పద వ్యాఖ్యలు