“సాహో” తరువాత ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రంగా కె కె రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని గోపికృష్ణ మూవీస్, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం 1970 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికం విద్య తెలిసిన వ్యక్తి పాత్రలో కనిపించబోతున్నారు. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో `జాన్` సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేస్తాడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ప్రభాస్ కథలు వింటున్నాడు. లేటెస్ట్ సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి రీసెంట్‌గా ప్రభాస్‌ను కలిసి కథను వినిపించాడట. `సైరా నరసింహారెడ్డి` తర్వాత సురేందర్ రెడ్డి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. అన్ని అనుకున్నట్లు సవ్యంగా సాగితే దిల్‌రాజు నిర్మాణంలో ప్రభాస్ హీరోగా సురేందర్ రెడ్డి సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఇంకా చర్చల దశలోనే ఉంది. మరి ఈ ప్రాజెక్ట్ ఓకే కావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
previous post