లాక్ డౌన్ సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన హీరో, హీరోయిన్లు సైతం తమ వంతుగా సినీ కార్మికుల కోసం డొనేషన్లు అందించారు. తాజాగా హీరో శ్రీకాంత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడలోని కృష్ణకాంత్ పార్కు దగ్గర బుధవారం మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్త్ మధ్య ఈ కార్యక్రమం అక్కడ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో శ్రీకాంత్‌తో పాటు శ్రీమిత్ర చౌదరి, డీసీపీ ట్రాఫిక్ చౌహన్ సహా పలువురు పోలీస్ సిబ్బంది యూసుఫ్ గూడ కృష్ణకాంత్ పార్క్ ముందు ఫుడ్ ప్యాకెట్స్‌ను అందచేశారు . ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘‘ఈ కరోనా మహమ్మారి సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పోలీసులు పర్మిషన్తో, వారి ఆధ్వర్యంలోనే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. పోలీసుల సహకారం మరువలేనిది. ఆకలితో అలమటిస్తున్న కొంతమందికైనా సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. లాక్ డౌన్ ఉన్నంతకాలం నాకు చేతనైనంత వరకు నేను ఇలా సాయం చేయాలనుకుంటున్నాను. అందరూ ఇంట్లో ఉండి కరోనా మహమ్మారి ని తరిమికొట్టాలి’’ అని అన్నారు
previous post