telugu navyamedia
సినిమా వార్తలు

“కల్కి” రివ్యూల గురించి ప్రశాంత్ వర్మ ఏమన్నారంటే…

kalki movie first look

రాజశేఖర్‌ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ “కల్కి”. అదా శర్మ, నందితా శ్వేత నాయికలు. పూజితా పొన్నాడ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించగా… స్కార్లెట్‌ విల్సన్‌ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. శివానీ, శివాత్మిక సమర్పణలో సి. కళ్యాణ్‌ నిర్మించారు. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం. 1983 నేపథ్యంలో సాగే ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథ ఇది. ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కన్పించాడు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వ‌చ్చాయి. క‌థ కొత్త‌గా ఉన్న‌ప్ప‌టికీ, అన‌వస‌ర‌మైన హీరోయిజం కార‌ణంగా సినిమా గాడి త‌ప్పింద‌ని చాలా మంది అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ రివ్యూల‌పై తాజాగా ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వ‌ర్మ స్పందించాడు. “సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. రివ్యూలు చూశాను. నేను ఈ సినిమాకు రివ్యూ రాసినా త‌క్కువ రేటింగే ఇచ్చి ఉండేవాడిని. ఇది ఒక వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా. వారికి ఈ సినిమా బాగా న‌చ్చింది. ఆ విష‌యంలో చాలా సంతృప్తిగా ఉన్నాను” అని ప్ర‌శాంత్ వ‌ర్మ అన్నాడు.

Related posts