నన్ను తప్పించాలన్న ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం జీవోజారీ చేసిందని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆరోపించారు. తనను తొలగించేందుకు ఆర్డినెన్స్ తీసుకుని రావడాన్నిహైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిన్న సాయంత్రం హైకోర్టులో ఆయన ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు. వెంటనే జీవోపై స్టే విధించాలని కోరారు. తాను స్థానిక ఎన్నికలను వాయిదా వేయకుంటే, ఏపీ ఈపాటికి కరోనా హాట్ స్పాట్ గా మారి ఉండేదని అన్నారు.
ఎన్నికలు వాయిదా వేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి, తనకు మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ వెనుక దురుద్దేశాలు ఉన్నాయని అన్నారు. సర్వీస్ నిబంధనలను మారుస్తూ జారీ చేసిన జీవోలను నిలుపుదల చేయాలని ఆయన కోరారు. అత్యవసర సమయాల్లో మాత్రమే ఆర్డినెన్స్ లను తేవాలని, అది కూడా న్యాయ సమీక్షకు లోబడివుండాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందన్నారు.


అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై రోజా కౌంటర్