కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 4వేల మందికి పైగా ప్రజలు దీని బారిన పడి మరణించారు. మరోవైపు కరోనా వ్యాప్తి వల్ల సినీ రంగం కూడా కుదేలయింది. ఇప్పటికే చాలా చోట్ల సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ప్రముఖ సినీ నటుల షూటింగ్‌లు, ప్రచార కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ సినిమా కోసం జనాలు తెగ ఆరాటపడిపోతున్నారు. ఇక డౌన్లోడ్లు అయితే విపరీతంగా జోరందుకుంటున్నాయి. అదే ‘కంటేజియన్’. ఇది అమెరికన్ మెడికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం. 2011లో ఈ సినిమా విడుదలవ్వగా… స్టీవెన్ సోడర్ బర్గ్ దర్శకత్వం వహించారు. ఇందులో మాట్ డామన్, లారన్స్ ఫిష్ బర్న్, జూడ్ లా, గ్వినేత్ పాల్ట్రో కీలక పాత్రలు పోషించారు. కరోనా విజృంభణకు ముందు ఈ చిత్రం అసలు టాప్ 100 జాబితాలో కూడా లేదు. కానీ ఇప్పుడు టాప్ 10 ప్లేస్‌కి చేరుకుంది. క్షణం క్షణం.. ఎంతో ఉత్కంఠగా సాగే ఈ సినిమా కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కథ ప్రస్తుతం మనం నిజ జీవితంలో ఎదుర్కొంటున్న కరోనాకు దగ్గరగా ఈ మూవీ కథ ఉండటమే విశేషం. దీంతో.. ఈ సినిమాను విపరీతమైన ఆసక్తి పెరిగింది నెటిజన్లకు. దీంతో.. కరోనా వైరస్ వచ్చిన దగ్గరనుంచీ ఇప్పటివరకూ ‘కంటేజియన్’ సినిమా డౌన్లోడ్లు క్రమంగా పెరిగాయి.
previous post