అమెరికాలో లాస్ ఏంజెల్స్‌లోని డాల్బి థియేటర్లో 92వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పలు విభాగాలకి సంబంధించి విజేతలు బహుమతులు అందుకున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పురస్కారాల్లో ఉత్తమ విభాగాల్లో హాలీవుడ్ తారల సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుకలో… లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరుగుతున్న ఈ వేడుకలో నటీమణులు రెడ్ కార్పెట్‌పై హోయలు పోతున్నారు. ప్రపంచంలోని తారలందరు ఒకే చోట చేరడంతో ఆ ప్రాంగణం శోభాయమానంగా మారింది. ఉత్తమ యానిమేటేడ్ షార్ట్ ఫిలింగా హెయిర్ లవ్ చిత్రానికి ఆస్కార్ అవార్డ్ దక్కగా, ఉత్తమ సహాయ నటుడిగా బ్రాడ్‌పిట్ (వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్), బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిలింగా టాయ్ స్టోరీ చిత్రాలు అవార్డులని దక్కించుకున్నాయి. బ్రాడ్ పిట్‌కు తొలిసారి ఆస్కార్ అవార్డ్ దక్కడం విశేషం.
Brad Pitt backstage, just moments after winning the Oscar for Best Supporting Actor. #Oscars pic.twitter.com/0vXToWTAgq
— The Academy (@TheAcademy) February 10, 2020