టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు. ఉదయం 9 గంటలకు బాబు నివాసంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ పూర్తయిన అనంతరం టీడీపీ ఎంపీలతో బాబు భేటీ కానున్నారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో ఆయన చర్చించనున్నారు. కాగా.. ఈనెల 18 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.