telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇంటిపని చేసి భార్యకు కాఫీ పెట్టిచ్చిన చరణ్… ఆ నలుగురికి ఛాలెంజ్

ram-charan

ఈ లాక్‌డౌన్ వేల ఇంట్లో అసలు సిసలు మగాడిగా ఉండండి అంటూ ‘బీ ద రియల్ మ్యాన్’ అనే ఛాలెంజ్‌ను విసురుతున్నారు తెలుగు సినీ ప్రముఖులు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా `బి ది రియల్ మేన్` పేరుతో ఓ ఛాలెంజ్‌కు శ్రీకారం చుట్టాడు. దానికి దర్శకుడు రాజమౌళిని నామినేట్ చేశాడు. రాజమౌళి ఆ ఛాలెంజ్‌ను పూర్తి చేసి రామ్‌చరణ్‌, ఎన్టీఆర్ లను నామినేట్ చేశాడు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి పిలుపు మేరకు ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఇంట్లో పనిచేస్తూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ద్వారా వీడియోను అభిమానులతో పంచుకున్నారు. మాప్‌తో ఫ్లోర్ క్లీన్ చేసేశారు, మొక్కలకు నీళ్లు పోశారు, భార్య ఉపాసనకు కాఫీ పెట్టిచ్చారు. ఇంట్లో పనులు చేయడాన్ని గర్వంగా భావిద్దాం. నిజమైన మగాళ్లుగా ఉందాం. మహిళలకు సాయం చేసి పని భారాన్ని పంచుకుందాం. బి ద రియల్ మ్యాన్. త్రివిక్రమ్ గారు, రణ్‌వీర్ సింగ్, రానా దగ్గుబాటి, శర్వానంద్‌ ఈ ఛాలెంజ్‌ను చేసి చూపించాలని నేను నామినేట్ చేస్తున్నాను అని తన ట్వీట్‌లో రామ్ చరణ్ పేర్కొన్నారు.

Related posts