telugu navyamedia
రాజకీయ వార్తలు

లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి క్లారిటీ లేదు: సోనియా

Soniya gandhi

లాక్ డౌన్ విషయంలో కేంద్రానికి ఒక క్లారిటీ లేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ విమర్శించారు. విపక్ష పార్టీల కూటమి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొలుత లాక్ డౌన్ 21 రోజులే అనుకున్నారని చెప్పారు. ఇప్పుడు ఎన్ని రోజులు కొనసాగిస్తారో కూడా అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యాక్సీన్ కనిపెట్టేంత వరకు కరోనా వైరస్ ఉంటుందనేది వాస్తవమని… లాక్ డౌన్ కొనసాగిస్తే, కోలుకోలేని నష్టం వాటిల్లుతుందని చెప్పారు.

పేద ప్రజల పట్ల కేంద్రానికి ఎలాంటి సానుభూతి లేదని అన్నారు. సంస్కరణల పేరుతో కేంద్రం దారుణమైన చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారమంతా ప్రధాని కార్యాలయానికే పరిమితం అయిందని సోనియా అన్నారు. రాజ్యాంగం పేర్కొంటున్న సమాఖ్య వ్యవస్థను కేంద్రం పక్కన పెట్టేసిందని విమర్శించారు.

ప్రధాని మోదీ ప్రకటించిన రూ. 20 లక్షల ప్యాకేజీపై విమర్శలు చేశారు. ఆ తర్వాత ఐదు రోజు పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దాన్ని వివరించిన విధానం అంతా పెద్ద జోక్ గా ఉందని ఎద్దేవా చేశారు. వలస కార్మికులను అసలు పట్టించుకోలేదని విమర్శించారు.ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే హాజరుకాగా… అఖిలేశ్ యాదవ్, మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారు.

Related posts