మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో స్లో అయ్యింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్గా దుల్కర్ సల్మాన్‌తో కలిసి సినిమా చేస్తుంది. మలయాళంలో రూపొందిన `ప్రేమమ్` సినిమాతో దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది అనుపమా పరమేశ్వరన్. అదే సినిమా రీమేక్‌తో తెలుగువారినీ పలకరించింది. ఆ తర్వాత తెలుగులో పలువురు యంగ్ హీరోల సరసన నటించింది. అయితే ఆ పాత్రలన్నీ గ్లామర్‌కు దూరంగా పక్కంటి అమ్మాయి తరహా పాత్రలే. తనకు అలాంటి పాత్రలే సరిపోతాయని, గ్లామరస్ పాత్రలు తనకు సూట్ కావని తాజాగా అనుపమ అభిప్రాయపడింది. `గ్లామర్ పేరిట నేను పొట్టి బట్టలు వేసుకోలేను. నాకు అవి సరిపడవు. సాంప్రదాయదుస్తుల్లో కూడా అందంగా కనిపించవచ్చు. నేను సహజంగా కనిపించడానికే ఇష్టపడతా. షూటింగ్ ఉంటేనే నేను మేకప్ వేసుకుంటా. లేకపోతే సాధారణ అమ్మాయిలాగానే ఉంటాను” అని అనుపమ చెప్పింది.
previous post